Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్‌!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్‌ విధించడంతో.. తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు

New Update
Tirumala Ap

Tirumala Ap Photograph: (Tirumala Ap )

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ సిట్ అధికారులు నలుగుర్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌ రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు విపిన్,‌ పొమిల్‌తో పాటుగా ‌తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఎండీ డా రాజు రాజశేఖరన్‌లు.. తిరుపతి జల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో అపూర్వ చావడాలను సీబీఐ సిట్‌ అధికారులు తిరుపతిలో అరెస్టు చేశారు.

Also Read: Horoscope Today:నేడు ఈ రాశి వారికి వాయిదా పడ్డ పనులన్నీ పూర్తై పోతాయి!

ఈ నలుగుర్ని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి.. రాత్రి 10.30కు తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. ఈ నలుగురికి ఈ నెల 20 వరకు రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నమోదైన కేసులో నలుగుర్ని అరెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి. 

Also Read: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.. ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసి.. గత మూడు రోజులుగా వైష్ణవి డెయిరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని ప్రశ్నించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్‌, పొమిల్‌, అపూర్వ చావడా, రాజు రాజశేఖరన్‌లను అధికారులు ఆదివారం ప్రశ్నించేందుకు పిలిపించారు.

తప్పుడు డాక్యుమెంట్లు...

ఈ క్రమంలో చెన్నై ఏఆర్‌ డెయిరీ పేరుతో శ్రీవైష్ణవి డెయిరీ ప్రతినిధులే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్‌ కనుగొంది. శ్రీవైష్ణవి డెయిరీ ఏఆర్‌ డెయిరీ పేరును ముందుపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించారట.

అలాగే జార్ఖండ్‌కు చెందిన భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌కు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని.. మిగిలిన చోట్ల నెయ్యి సేకరించి సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ అంశంపై ఆ సంస్థ సిట్ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదంటున్నారు. అలాగే దర్యాప్తులో కూడా పలు కీలక అంశాలు బయటపడ్డాయంటున్నారు. 

దర్యాప్తులో తేలిన అంశాలపై సిట్‌ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా వారు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణకు సహకరించకపోవడంతో నలుగుర్ని సిట్‌ అరెస్టు చేసినట్లు సమాచారం.

Also Read: Gaza:గాజాకు కరవు తప్పింది కానీ...!

Also Read: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు