/rtv/media/media_files/2026/01/08/fotojet-95-2026-01-08-14-54-47.jpg)
Bomb Threat: ఏపీలోని పలు కోర్టు ప్రాంగణాలకు బాంబు బెదిరింపులు(Bomb Threat News) రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం(ananthapur) జిల్లా కోర్టుతో పాటు ఏలూరు కోర్టు, చిత్తూరు కోర్టు, విశాఖ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లకు కూడా బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కోర్టు ప్రాంగణం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. మొదట అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్‌లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం అంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపి మరీ తనిఖీలను కొనసాగించారు. - Bomb threat latest
Also Read : ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రా భారీగా నకిలీ తేనె.. సీరం కలిపి తయారీ
ఏలూరు కోర్టు కాంప్లెక్స్‌కు ..
అటు ఏలూరు(eluru) కోర్టు కాంప్లెక్స్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తేలింది. మధ్యాహ్నం 1:35 గంటలకు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు.
ఏలూరు కోర్టు కాంప్లెక్స్‌లో..
బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు కోర్టు..
చిత్తూరు(chittor) కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు కలవరం పెట్టింది. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తి జిల్లా జడ్జికి మెయిల్ పెట్టాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యంత్రాంగం.. కోర్టు ప్రాంగణంలో బాంబ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కోర్టులో బాంబు పెట్టారనే బెదిరింపుతో అక్కడ ఉన్న న్యాయవాదులు పరగులు తీశారు.మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ బాంబు బెదిరింపు ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read : పాశర్లపూడి బ్లో ఔట్ కు ముప్పై ఏళ్లు...ఇరుసిమండలో మరో గ్యాస్ బ్లో అవుట్
విశాఖ జిల్లా కోర్టుకు..
కాగా, బాంబు మెయిల్స్‌తో అలెర్ట్ అయిన పోలీసులు విస్తృతంగా చేపట్టారు. జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ న్యాయస్థానాల్లో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసి... బాంబు ఆనవాళ్లు లేవని పోలీసుల నిర్ధారించారు. విశాఖ జిల్లా కోర్టుకు సైతం బాంబు బెదిరింపు వచ్చినట్లు చెబుతున్నారు. మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు దిగాడు ఓ ఆగంతకుడు. తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్ధాలు లేవని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో కోర్టు సిబ్బంది, లాయర్లు ఊపిరిపీల్చుకున్నారు. - vishaka
Follow Us