Bomb threat : ఎయిరిండియాకు తప్పని కష్టాలు.. బాంబు బెదిరింపుతో రియాద్‌కు దారి మళ్లింపు
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు లేవు. తాజాగా బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ కి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్ కు దారి మళ్లించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేల్చారు.