/rtv/media/media_files/2025/10/03/chandra-babu-and-jagan-2025-10-03-16-01-13.jpg)
Chandra Babu and Jagan
Bomb Threat Mails To Chandrababu - Jagan - Tirupati
ఏపీలోని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్(YS Jagan) ఇళ్లల్లో బాంబులు పెట్టాని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. అలాగే తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరించారు. ''హోలి ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్'' పేరిట భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆయా ప్రాంతాల్లో నిందితుల కోసం గాలిస్తున్నారు. అక్టోబర్ 6న తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాంబు స్క్వాడ్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతితో పాటు శ్రీకాళహస్తిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలోని సీఎం హెలీపాడ్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
Also Read : ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు.. ఆ జిల్లాలోని 10 మండలాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్!
Also Read : ముంచుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ