/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-2025-07-28-18-16-48.jpg)
Srishti Test Tube Baby Center
Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. వారు అలా ప్రకటించారో లేదో ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేశారు. సోమవారం ఉదయానికి
సెంటర్‌కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్‌లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. ఈ రోజు ఆ సెంటర్ సిబ్బంది ఎవరూ కూడా విధులకు హాజరుకాలేదు. అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇది కూడా చదవండి:నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
కాగా, సికింద్రాబాద్‌లో ఒకరి భర్తకు బదులు మరోకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం వంటి గలీజు పనులు నిర్వహిస్తున్నారని తెలియడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీంతో విజయవాడ, విశాఖ పట్నంలో నిర్వహిస్తున్న సెంటర్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. విజయవాడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో విధులు నిర్వహించే డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకునేప్పటికీ అక్కడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు చెందిన ఆనవాళ్లు సైతం లేకుండా చేశారు.
ఇది కూడా చదవండి: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!
సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ నిర్వహిస్తున్న సెంటర్‌లలోనూ సరోగసి పేరుతో అనేక మోసాలు జరిగాయని, వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్‌కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసింది. ఇలాగే అనేక మందని మోసం చేసి రూ. కోట్ల దందా చేసినట్లు తేలింది.
Also Read:వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్‌కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీ, గోపాలపురం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించినట్లు గుర్తించారు.
Also Read : తండ్రైన ‘ఛావా’ నటుడు.. మగబిడ్డకు స్వాగతం
కాగా, విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్‌ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోని మహారాణిపేట పీఎస్ పరిధిలో కూడా సెంటర్లు ఉన్నాయి. అయితే వీటి లైసెన్స్‌లు 2023లోనే ముగిసినా అనధికాంగా నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్‌గా ఆమె ఎదగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read:Sanjay Dutt: ఇదెక్కడి అభిమానం రా బాబు .. కోట్ల ఆస్తిని హీరోకు రాసిచ్చిన ఫ్యాన్! తర్వాత ఏం జరిగిందంటే?