Sanjay Dutt: ఇదెక్కడి అభిమానం రా బాబు .. కోట్ల ఆస్తిని హీరోకు రాసిచ్చిన ఫ్యాన్! తర్వాత ఏం జరిగిందంటే?

అభిమాన హీరోకు కోసం ఫ్యాన్స్  అన్నదానాలు చేయించడం, సినిమా విడుదలైతే కటౌట్లు పెట్టించడం, పాలాభిషేకాలు చేయించడం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ అభిమాని మాత్రం తన ఫేవరేట్ హీరో ఏకంగా రూ. 72 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు!

New Update
fan gifted 72cr property to sanjay dutt

fan gifted 72cr property to sanjay dutt

Sanjay Dutt: అభిమాన హీరోకు కోసం ఫ్యాన్స్  అన్నదానాలు చేయించడం, సినిమా విడుదలైతే కటౌట్లు పెట్టించడం, పాలాభిషేకాలు చేయించడం చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా ఆస్తులు రాసివ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా! అవునండి బాబు మీరు విన్నది నిజమే. ఓ అభిమాని మాత్రం పేరు మీద రూ. 72 కోట్ల ఆస్తిని రాశాడు! ఇది వినడానికి కొంచం షాకింగ్ గా ఉంది కదూ!  కానీ ఇది నిజమే! హీరోపై ప్రేమతో అభిమాని ఆస్తి రాసిచినప్పటికీ, ఆ హీరో మాత్రం మంచి మనసుతో దానిని తిరస్కరించారు. తిరిగి ఆ కుటుంబానికే ఇచ్చేశాడు. ఆ హీరో మరెవరూ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్ దత్ ఈ విషయాన్ని పంచుకున్నారు. 

Also Read: Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!

కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని

సంజయ్ దత్ మాట్లాడుతూ.. గతంలో తనను ఎంతో అభిమానించే ఒక మహిళా ఫ్యాన్ తన పేరు మీద రూ. 72 కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చినట్లు  వెల్లడించారు. అయితే ఆ అభిమాని 2018లో మరణించగా..  తన ఆస్తి మొత్తం హీరో సంజయ్ దత్ కు  చెందేలా వీలునామా రాశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ దత్ ఆశ్చర్యపోయారట. ఆ అభిమాని చూపిన ప్రేమకు, చలించిపోయినట్లు తెలిపారు. కానీ, తను ఆ ఆస్తిని తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆస్తి మొత్తాన్ని కుటుంబ సభ్యులకే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అనుకున్నట్లుగా ఆస్తి ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చేసినట్లు తెలిపారు. 

Also Read: Hari Hara Veera Mallu: ‘HHVM’ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం అదే.. మొత్తం చెప్పేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ

Advertisment
తాజా కథనాలు