Vineet Kumar Singh: తండ్రైన ‘ఛావా’ నటుడు.. మగబిడ్డకు స్వాగతం

‘ఛావా’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు వినీత్ కుమార్ సింగ్, ఆయన సతీమణి రుచిరా సింగ్ తల్లిదండ్రులయ్యారు. ఈ దంపతులు పండంటి మగబిడ్డకు స్వాగతం పలికారు. జూలై 24న తమ చిన్నారి జన్మించినట్లు వినీత్, రుచిరా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక అందమైన పోస్ట్‌తో తెలియజేశారు.

New Update
Vineet Kumar Singh

Vineet Kumar Singh

‘ఛావా’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు వినీత్ కుమార్ సింగ్, ఆయన సతీమణి రుచిరా సింగ్ తల్లిదండ్రులయ్యారు. ఈ దంపతులు పండంటి మగబిడ్డకు స్వాగతం పలికారు. జూలై 24న తమ చిన్నారి జన్మించినట్లు వినీత్, రుచిరా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్‌తో తెలియజేశారు. 

Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Vineet Kumar Singh

వారు షేర్ చేసిన పోస్టర్‌లో.. చిన్న గుర్రం, రాకెట్‌లో వెళ్తున్న టెడ్డీ బేర్ బొమ్మతో కూడిన బ్లూ కలర్ డిజైన్‌ ఉంది. దానిపై ‘‘ఇట్స్ ఏ బాయ్! మా చిన్న నక్షత్రం వచ్చింది!’’ అని రాసుకొచ్చారు. ‘‘దేవుని దయ పొంగి పొర్లుతోంది! ప్రపంచమా, కాస్త పక్కకు జరుగు. మా చిన్న సింగ్ వచ్చేశాడు. అప్పుడే తను మనసులనూ, పాలు సీసాలనూ దొంగిలిస్తున్నాడు. ఈ విలువైన ఆనందాన్ని ప్రసాదించిన దేవునికి ధన్యవాదాలు!’’ అంటూ రాసుకొచ్చారు. 

Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

ఈ శుభవార్తను ప్రకటించిన వెంటనే.. సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. విక్రాంత్ మాస్సే, అహానా కుమ్రా వంటి తారలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. 

ఛావాతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అగ్లీ, ముక్కాబాజ్ వంటి చిత్రాలతో వినీత్ కుమార్ సింగ్‌కు మంచి గుర్తింపు లభించింది. నాలుగు థియేట్రికల్ రిలీజ్‌లు.. మ్యాచిఫిక్సింగ్, ఛావా, సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్, జాట్‌తో పాటు ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ రంగీన్‌తో వినీత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు