/rtv/media/media_files/2025/07/27/pet-given-as-punishment-30-people-fell-ill-2025-07-27-10-29-23.jpg)
PET given as punishment..30 people fell ill
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్‌లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. పాఠశాల విద్యార్థినీలు పూర్తి యూనిఫాంతో రాలేదని పీఈటీ ఉపాధ్యాయుడు సుబాన్ విద్యార్థినీలతో గుంజీలు తీయించాడు. దీంతో విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థునుల కాళ్లు వాచిపోవడంతో పాటు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో వారంతా నొప్పితో తీవ్రంగా విలపించారు.
Also Read:ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
Also Read : ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
PET Given As Punishment - 30 People Fell Ill
అస్వస్థతకు గురైన విద్యార్థునీలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న విద్యార్థినీల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకేని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న డిఎస్పీ గీతా కుమారి, ఇతర పోలీసులు హాస్పిటల్ కు చేరుకొని విద్యార్థినిలను పరామర్శించారు. విద్యార్థినీలతో గడిపిన డీఎస్పీ ఘటనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. ఘటనపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
Also Read : తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో 65 మంది విద్యార్థులు..!
nellur | guduru | school | school-students | pet | nellore-district | nellore