Pahalgam Terror Attack: కావలి చేరుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది.