Telangana: తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌‌తో 65 మంది విద్యార్థులు..!

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ కలకలం రేపింది. ఆహారం వికటించి 69 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

New Update
Food poisoning at a Gurukul school in Uyyalawada, Nagarkurnool district

Food poisoning at a Gurukul school in Uyyalawada, Nagarkurnool district

నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ కలకలం రేపింది. ఆహారం వికటించి 69 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు రావడంతో విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో 12 మంది డిశ్చార్జి అవగా.. ఇంకొందరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Also Read :  IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?

Food Poisoning

అనంతరం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులకు అందించిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

Also Read :  చికెన్ ధరలు ఢమాల్.. కేజీ మరీ ఇంత చీప్ గానా!

latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telugu crime news

Advertisment
తాజా కథనాలు