దంపతుల కిడ్నాప్ అడవిలోకి తీసుకెళ్లి.. | Wife And Husband kidnapped | Nellore District | RTV
AP: ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో ఉచిత ఇసుక పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామంలో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెద్దపులి కారును ఢీ కొట్టిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును పులి వెంబడించి దాడికి పాల్పడింది. దీంతో కారు ముందుభాగం భారీగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫారెస్ట్ అధికారులు పులికోసం గాలిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్డ్రింక్ అనుకుని రెండేండ్ల బాలుడు పెట్రోల్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. పిల్లాడిని గమనించిన తల్లి అమ్ములు వెంటనే కాలేషాను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావాలి అభ్యర్థులను మారిస్తేనే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తానని వేమూరి ప్రభాకర్ రెడ్డి వైసీపీ హైకమాండ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ బాలికల హాస్టల్ లో విద్యార్థులు కూలీలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హాస్టల్ కు సంబంధించిన వస్తు సామాగ్రిలను బాలికల చేత మోయించడం వివాదాస్పదంగా మారింది.. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. సోమవారం వేకువజాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.