/rtv/media/media_files/2025/07/31/apsrtc-free-bus-scheme-ticket-2025-07-31-12-15-07.jpg)
APSRTC Free Bus Scheme Ticket
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని పథకాన్ని ‘స్త్రీ శక్తి’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలు, ఆర్థిక భారం, ఎదురయ్యే సవాళ్ల గురించి జూలై 21న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రంలో మహిళలకు ‘ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై మాట్లాడారు.
Also Read: ఫ్రీ గ్యాస్ సిలిండర్.. అప్లై చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం.. చివరి తేదీ ఎప్పుడంటే?
రాష్రంలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం స్కీమ్‌ను ఆగస్టు 15వ తేదీ నుంచి అంటే స్వాతంత్ర్య దినోత్సం నుంచే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రయాణ సమయంలో మహిళలకు ‘జీరో ఫేర్ టికెట్’ (సున్నా ఛార్జీ) ఇవ్వాలని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రకటనతో ఏపీలో మహిళలందరూ సాధారణ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేసే సౌకర్యాన్ని పొందుతారు.
APSRTC సాధారణ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఫ్రీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డు సహా మరేదైనా ఐడీ ద్వారా ప్రయాణికులను గుర్తించే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం స్మార్ట్ కార్డులు లేదా మరేదైనా డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఈ పథకం అమలులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు.. అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా.. పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయాలని, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: YS జగన్‌కు గుడ్‌న్యూస్.. విజయమ్మ, షర్మిలపై జగన్ పైచేయి
ఫ్రీ బస్ టికెట్ ఫోటో
ఈ క్రమంలో ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన ‘‘జీరో టికెట్’ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో టికెట్ పై ఆంద్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అని ఉంది. దాని కింద డిపో పేరు రాసుంది. ఆ తర్వాత జర్నీ డేట్ టైం ఉన్నట్లు కనిపిస్తోంది. దాని కింద బస్సు పేరును ఉంచారు. వీటి తర్వాత ‘‘స్త్రీ శక్తి’’ అంటూ.. ప్రయాణించేవారు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తున్నారు అని వారి గమ్యస్థానం.. అలా సీట్ నెంబరు, టికెట్ ధర, ప్రభుత్వ రాయితీ వంటి అంశాల్ని ముద్రించారు. చివరిగా చెల్లించాల్సింది ‘జీరో’ అని రాసి ఉంచారు. ప్రస్తుతం ఈ టికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మహిలలు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/31/free-bus-2025-07-31-12-19-23.jpeg)
ap-free-bus-scheme | ap free bus to women | Stree Shakti free bus ticket | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | viral news telugu