/rtv/media/media_files/2024/10/27/NlPiKgknkYtW4rQUV7wR.jpg)
Free Gas
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే భాగంగా దీపం-2 పథకం కింద పేదలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తోంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించింది. ఇప్పుడు రెండో విడత ప్రక్రియ నడుస్తోంది. అయితే కొందరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడతకు అప్లై ఇంకా అప్లై చేసుకోలేదు. ఈ రెండో విడత ఉచిత సిలిండర్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జులై 31. ఈ తేదీలోగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే రెండో విడత కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందుతుంది. ఆ తర్వాత లబ్ధిదారులు అప్లై చేసుకోవడానికి కూడా కుదరని అధికారులు చెబుతున్నారు. ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అప్లై చేసుకోని వారు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: August 2025 New Rule: ఆగస్టు 1 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో మార్పులు..!
మూడో విడత ఎప్పుడంటే?
దీపం-2 సంక్షేమ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అందజేసింది. ఇప్పుడు రెండో విడత కూడా అప్లై చేసుకోవడానికి పూర్తి అయితే వీటిని కూడా అందజేస్తుంది. అయితే ఈ రెండో విడత పూర్తి అయిన వెంటనే దీపం-2 పథకం కింద మూడవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్‌కి ఆగస్టు 1వ తేదీ అప్లై చేసుకోవాలి. అర్హతలు ఉన్న లబ్ధిదారులు నవంబర్ 30వ తేదీ లోగా ఈ మూడవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సమయంలో మాత్రమే బుక్ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.
ఇది కూడా చూడండి: Minister Kollu Ravindra : ఏపీలో వారందరికీ రూ.10 వేలు. మంత్రి సంచలన ప్రకటన
48 గంటల్లోపే రాయితీ..
లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లోపే రాయితీ మొత్తం బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది. దీనికి అప్లై చేసుకున్న తర్వాత అకౌంట్‌లోకి డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని మీరు బ్యాంక్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు సరిగ్గా లేకపోతే వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తప్పకుండా బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉండేలా లబ్ధిదారులు చూసుకోవాలి.
ఇది కూడా చూడండి: YCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!
86 వేల మందికి నో సబ్సిడీ
దీపం-2 పథకం అమలులో భాగంగా కొందరు లబ్ధిదారులు బ్యాంకు వివరాలను సరిగ్గా ఇవ్వలేదు. తప్పుడు వివరాలు ఉండటం వల్ల దాదాపుగా 86 వేల మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు సబ్సిడీ అందలేదు. ఎవరికైతే సబ్సిడీ అందలేదో వారు వెంటనే బ్యాంక్ వివరాలను పూర్తిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఆధార్ నంబర్‌తో బ్యాంక్ లింక్ కాకపోయినా కూడా సబ్సిడీ రాదు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు!