వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్‌కు భారీ ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ పైచేయి సాధించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ, షర్మిలకు మధ్య జరిగిన షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ NCLT ఉత్తర్వులు జారీ చేసింది.
YS Jagan Files Petition Against Sister Sharmila and Mother Vijayamma Over Saraswati Power Shares Dispute
— Sudhakar Udumula (@sudhakarudumula) October 23, 2024
In a growing family rift, former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and his wife YS Bharati have filed a petition in the National Company Law Tribunal (NCLT)… pic.twitter.com/Sk8ZbMdPTq
కంపెనీ షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేశారంటూ జగన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లను రద్దు చేయాలని మాజీ సీఎం జగన్ పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను NCLT అనుమతించింది. ఈ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈరోజు(సోమవారం) విచారించింది. సంస్థలో జగన్ వాట 51శాతం, విజయమ్మవాట 49శాతంగా ఉంది. అయితే 100శాతం వాట తనదే అంటూ విజయమ్మ ఆరోపిస్తున్నారు.
2019 ఆగస్టు 21 MOU ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సతీమణి భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల వివాదంపై సెప్టెంబర్ 10న జగన్, భారతిలు NCLTలో పిటిషన్‌ను వేశారు. వైఎస్ జగన్ తరఫున వై.సూర్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్‌సీఎల్‌టీ ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రారర్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చారు.