Nara Lokesh: డిప్యూటీ సీఎంగా నారా లోకేష్.. ఏపీ పాలిటిక్స్ లో సంచలనం!

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కోరారు. తద్వారా పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఈ రోజు మైదుకూరు మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Nara Lokesh Chandrababu

Nara Lokesh Chandrababu

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబునాయుడు కోరడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు నిర్వహించిన కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదికపైనే ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. టీడీపీ (TDP) లో లోకేష్‌ మూడో తరం నేత అని అన్నారు. యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read :  వాళ్లకి ఉచిత కరెంట్, నీరు.. కేజ్రీవాల్ సంచలన హామీ

Deputy CM Nara Lokesh

Also Read :  మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

ఇటీవల ఇదే అభిప్రాయాన్ని మహాసేన రాజేష్‌ సైతం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ (Nara Lokesh) ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు ఈ డిమాండ్ ను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబు ముందే ఆ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచనంగా మారింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ కానట్లు తెలుస్తోంది. 

Also Read :  స్పామ్ కాల్స్‌కు చెక్..సంచార్ సాథీ మొబైల్ యాప్

Also Read :  మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు