America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

ఇజ్రాయెల్‌,హమాస్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కు తన చివరి ప్రెస్‌ మీట్‌ లో చేదు అనుభవం ఎదురైంది.పూర్తి వివరాలు ఈ కథనంలో ..

New Update
blinken

blinken

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతల నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌,హమాస్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కు తన చివరి ప్రెస్‌ మీట్‌ లో చేదు అనుభవం ఎదురైంది.

Also Read: South Central Railway: సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..8 ప్రత్యేక రైళ్లు!

ఈ సమావేశంలో గాజా యుద్ధాన్ని కవర్‌ చేసిన ఇద్దరు జర్నలిస్టులు బ్లింకెన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.గాజాలో 15 నెలల యుద్ధం నేపథ్యంలో బైడెన్‌ తీసుకున్న నిర్ణయాలను బ్లింకెన్‌ సమర్థించడాన్ని ఓ పాత్రికేయుడు సామ్‌ హుస్సేన్‌ ప్రశ్నించారు.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారు కొత్త నగలు కొనుగోలు చేస్తారు..మీ రాశేనేమో చెక్‌ చేసుకోండి మరి!

అమ్నెస్టీ  ఇంటర్నేషనల్‌ నుంచి అంతర్జాతీయ నేర న్యాయస్థానం వరకు ఇజ్రాయెల్‌ నరమేధం జరుపుతోందని ,నాశనం చేస్తోందని చెప్పాయి. కానీ,మీరు ఆ ప్రక్రియను గౌరవించమని చెబుతున్నారు? అంటూ హుస్సేన్‌ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

అనంతరం భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో హుస్సేన్‌, బ్లింకెన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.అదే సమయంలో గ్రేజోన్‌ వార్తా సంపాదకుడు మాక్స్‌ బ్లూ మెంథల్‌ సైతం బ్లింకెన్‌ పై విమర్శలు గుప్పించారు. 

ఖతార్‌ మధ్యవర్తిత్వంతో..

ఇదిలా ఉండగా..ఇజ్రాయెల్‌ - హమాస్‌ ల మధ్య కాల్పుల విరమణ , బందీల విడుదల పై ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.అమెరికా , ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రక్రియ కొనసాగుతోంది.

దీని ప్రకారం..బందీల విడుదలకు ప్రతిగా పాలస్తీనీ ఖైదీలను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టనుంది. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

Also Read: Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు!

Also Read: Maha Kumbh Mela: నాగ సాధువులు రోజులో ఎంత తింటారు..ఎక్కడ ఉంటారు అంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు