/rtv/media/media_files/2025/01/18/s4lZp5IGzZHWxlbx7sIA.jpg)
Arvind Kejriwal
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో హామీని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వాంచల్‌కు చెందిన కౌలుదారులకు కూడా ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు.
Also Read: 65 లక్షల మందికి పైగా ఆస్తి కార్డుల పంపిణీ చేసిన ప్రధాని మోదీ
'' అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఫ్రీ స్కూల్, ఆస్పత్రి నుంచి ప్రయోజనాలు పొందుతున్నామని చెప్పారు. కానీ ఉచిత విద్యుత్, నీరు వంటి స్కీమ్స్‌కు దూరంగా ఉంటున్నామని తెలిపారు. అందుకే వాళ్ల సమస్యలు పరిష్కరించేందుకు ఆప్ ఆద్మీ పార్టీ కృషి చేస్తోందని'' కేజ్రీవాల్ తెలిపారు. ఇదిలాఉండగా ఇప్పటికే ఆప్.. మహిళ సమ్మాన్ యోజన స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2100 ఆర్థిక సాయం, వృద్ధుల కోసం ఉచిత వైద్యం, అలాగే అర్చకులకు రూ.18 వేల గౌరవ వేతన వంటి హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ప్రతినెల రూ.8500, మహిళలకు నెలకు రూ.2500, ఉచిత రేషన్ కిట్లు, కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చింది.
Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!
అయితే ఉచితాలకు తాము దూరం అని చెప్పికునే బీజేపీ కూడా ఇటీవలే 'సంకల్ప పత్రా' పార్ట్ 1 పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో గర్భిణులకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు మహిళా సమృద్ధి యోజన పథకం కింద ప్రతినెల రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.