Ap : ఏపీలో ఇక నుంచి అర్థరాత్రి 12 వరకు హోటల్స్‌...మంత్రి కీలక ప్రకటన!

రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్‌ చెప్పారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు రూ.66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామని తెలిపారు.

New Update
minister

minister

Ap: ఏపీ సర్కార్‌ ప్రజలకు తీపికబురు చెప్పింది.. హోటల్స్‌కు సంబంధించిన ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు తెరిచే ఉంటాయని.. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

Also Read: China: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌...ఎంత డబ్బు లెక్కపెడితే అంతా మీకే..కానీ కేవలం..!

హోటల్స్‌కు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. కాకినాడలో నిర్వహించిన ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ (ఏపీహెచ్‌ఏ) కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో మంత్రి ఈ ప్రకటన చేశారు.రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరిశ్రమలా తీసుకొస్తామన్నారు మంత్రి . రాష్ట్రంలో హోటళ్లకు విద్యుత్, ఇతర రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని.. పర్యాటక అభివృద్ధికి, హోటళ్ల రంగానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 

Also Read: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామన్నారు. 'గత ప్రభుత్వంలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజప్రాసాదాలు కట్టుకునే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. విశాఖపట్నం రుషికొండలో అద్భుతమైన రిసార్ట్‌ ద్వారా పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేదని, దాన్ని కూలగొట్టి రాజభవనం కట్టడంతో పైసా ఆదాయం రావడం లేదన్నారు.

హోటల్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన...

రాష్ట్రంలో పర్యాటకశాఖకు ఇండస్ట్రీ హోదా ఇస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పారు. ఈ మేరకు పరిశ్రమలకి ఇచ్చే రాయితీలు అన్ని ఇస్తామని.. హోటల్ రంగం విషయంలో ప్రభుత్వం కూడా ఆసక్తికరంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకరంగం అభివృద్ధి చెందాలంటే హోటల్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. హోటల్ యజమానుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని.. రాష్ట్రంలో రూ.1217 కోట్లతో హోటల్స్ రంగంలో పెట్టుబడులు కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు మంత్రి.

మరోవైపు పర్యాటక రంగానికి సంబంధించి రెండు రోజుల క్రితం భారీగా పెట్టుబడులు వచ్చాయి. మంత్రి దుర్గేష్ రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకాలు చేశారు. మొత్తం 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తామని.. ఎంటర్టైన్మెంట్, టూరిజంకు రియల్ హబ్‌గా విశాఖ మారుతుందని వివరించారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అన్నారు.

Also Read: Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

Also Read: Maha Kumbh Mela 2025: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే!

Advertisment
తాజా కథనాలు