/rtv/media/media_files/2025/01/30/esqkitEQBoZCx0Pl36aj.jpg)
china
China: చైనాకు చెందిన ఓ కంపెనీ తన సంస్థ ఉద్యోగులకు ఓ అద్భుతమైన బోనస్ ఆఫర్ ని ప్రకటించింది. చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్‌గా అందజేసింది. అయితే, ఈ బోనస్‌ను ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా నిర్వహించింది కంపెనీ యాజమాన్యం. ఇందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు కూడా చేసింది.
15 నిమిషాల్లో ఎంత మొత్తాన్ని....
ఇక ఈ మొత్తాన్ని పంపకం ఎలా నిర్వహించారన్న విషయానికి వస్తే.. బోనస్ మొత్తం సొమ్మును 60 నుంచి 70 మీటర్ల పొడవైన టేబుల్‌పై ఉంచారు. ఆపై ఉద్యోగులను 30 టీములుగా విడగొట్టారు. ఆ తర్వాత ఒక్కో టీమ్ నుంచి ఇద్దరిని ఎంపిక చేసి వారికి 15 నిమిషాల సమయం ఇచ్చారు. 15 నిమిషాల్లో ఎంత మొత్తాన్ని లెక్కపెడతారో.. అంత మొత్తం ఆ టీమ్‌కు ఇచ్చే విధంగా రూల్ ని పెట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెద్ద పెద్ద కట్టలుగా ఉన్న నోట్లను ఉద్యోగులు లెక్కపెడుతూ కనిపిస్తున్నారు. అయితే ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. హెనన్ మైన్ క్రేన్ సంస్థ గతంలో కూడా 2023 జనవరిలో ఇదే విధంగా రూ.70 కోట్ల బోనస్ తన ఉద్యోగులకు ఇచ్చింది. ఇది కంపెనీ ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహించే విధంగా మంచి ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
ఈ విధమైన బోనస్ పథకాలు ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, కంపెనీ సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం