Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Update
Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!

up

పెళ్లి కల వచ్చేసిందని ఆ పెళ్లి కొడుకు బంధు మిత్ర పరివారంతో కలిసి ముస్తాబై వధువు ఇంటికి చేరుకున్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్లాక విషయం తెలుసుకుని వరుడు కుటుంబానికి దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏం జరిగింది..ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

Also Read: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే!

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో  ఓ వ్యక్తికి మధ్యవర్తి ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది. ఫోన్‌లోనే ఫోటోలు పంపించుకుని.. మాట్లాడుకుని పెళ్లి ఖాయపరిచేసుకున్నారు. తీరా పెళ్లి రోజు ఆ వధువు గ్రామానికి వెళ్లగా.. అక్కడ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఈనెల 28వ తేదీన జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నారి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.

Also Read: DeepSeek: ప్లే స్టోర్ లో డీప్‌ సీక్‌ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!

వాట్సాప్‌లో పిక్‌ చూసి..

తన ఇంటి పక్కనే ఉండే రాజీవ్, మను దంపతులు.. తమకు తెలిసిన వారి కుటుంబానికి చెందిన ఓ యువతితో పెళ్లి (Marriage) నిశ్చయం చేశారు. అందుకు ప్రతిఫలంగా వారికి రూ.50 వేలు కూడా ఆ వరుడు ఇచ్చాడు. అయితే పెళ్లి కొడుకు నేరుగా పెళ్లి కుమార్తెను డైరెక్ట్‌ గా చూడకుండా.. వాట్సాప్‌లో పిక్‌ చూసి, ఆ వధువుతో మాట్లాడి పెళ్లి కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఫోన్‌లోనే అన్నీ మాట్లాడేసుకున్న ఆ రెండు కుటుంబాలు ఈనెల 28వ తేదీన పెళ్లి జరిపించాలని అనుకున్నారు.

ఈ క్రమంలోనే ఈనెల 28వ తేదీనవరుడు.. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి కుమార్తె ఊరు అయిన సింగా గ్రామానికి చేరుకున్నాడు. అయితే.. ఆ గ్రామంలో ఎక్కడా పెళ్లికి ఏర్పాట్లు లేకపోవడం చూసి వారంతా ఖంగు తిన్నారు. ఏ ఇంటి వద్ద కూడా పెళ్లి సందడి కనిపించకపోవడంతో వధువు ఫోటోను సింగ్రా గ్రామంలోని వారికి చూపించి వారి ఇల్లు ఎక్కడో అడిగాడు. అయితే ఆ ఫోటోలో ఉన్న యువతి ఎవరో తమకు తెలియదని.. అలాంటి అమ్మాయే తమ గ్రామంలో లేదని గ్రామస్తులు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

అయితే పెళ్లి కుమార్తెను తీసుకొస్తానంటూ మధ్యవర్తిగా వ్యవహించిన మను అనే మహిళ కారులో అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత విషయం అర్థం అయిన వరుడు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్నారు. అమ్మాయిని నేరుగా చూపించకుండా.. వరుడి ఇంటి పొరుగున ఉండే రాజీవ్‌, మను దంపతులు తమ వద్ద డబ్బులు తీసుకుని.. మోసం చేశారని వివరించారు. ఈ క్రమంలోనే రాజీవ్‌కు ఫోన్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందని ప్రశ్నించారు.

అయితే వధువు ఏదో పురుగుల మందు తాగిందని.. అందుకే ఆమెను పంజాబ్‌లోని నవాన్‌షహర్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.దీంతో వరుడి కుటుంబానికి అనుమానం వచ్చింది. మను కోసం వెతికి ఆమెను పట్టుకుని ఆ గ్రామానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. దీంతో మోసపోయామని గ్రహించి.. వరుడు, అతని కుటుంబం తిరిగి తమ గ్రామానికి వచ్చేసింది.

ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేదా పెళ్లికి మధ్యవర్తులుగా ఉన్నవారిపై ఉనా సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వరుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు.

Also Read: Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

Also Read: TG News: ఇందిర‌మ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు