Crime News : ప్రియుడికోసం మరో భార్య దారుణం..భర్తను చంపి..

ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. సమీప బంధువుతో ఏర్పడిన వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసింది.

New Update
Another wife who killed her husband

Another wife who killed her husband

Crime News : భార్యాభర్తల అన్యోన్య బంధాన్ని వివాహేతర సంబంధాలు కుప్పకూల్చుతున్నాయి. భర్తతో కొనేళ్లు కాపురం చేశాక మరో వ్యక్తి మోజులో పడి భర్తలను భార్యలు దారుణంగా హతమారుస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఇదే తంతు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో భార్యలను మాట అనాలంటేనే భర్తలు వణికిపోతున్నారు. తాజాగా  ప్రియుడి కోసం ఓ మహిళ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దారుణంగా చంపింది..ఈ దారుణ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి:High Court: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్‌ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించుకున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమవివాహం చేసుకున్నా కూడా వీరి జీవితం చక్కగా సాగింది.  స్థానికంగా ఒక ఇంట్లో వీరు అద్దెకు ఉంటున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఆనందంగా సాగుతున్న లక్ష్మణ్, పావని అన్యోన్య బంధం మధ్యలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు.

Also Read:'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్​లో చుక్కలు చూపించిన భర్త..!

ప్రదీప్‌కు పావనితో ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారిద్దరూ లక్ష్మణ్‌కు తెలియకుండా రహాస్యంగా కలుస్తూ ఉండేవారు. అయితే, పావనిపై భర్తకు అనుమానం వచ్చింది. ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 13వ తేదీన అనుహ్యంగా లక్ష్మణ్ చనిపోయాడు. నరసింహపురంలో లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. అయితే భర్త చావును సాధారణ చావుగా నమ్మించే క్రమంలో ఏమి తెలియనట్లు హడావుడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేయించింది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 71 మంది సజీవ దహనం!

 అయితే లక్ష్మణ్ తరపు బందువులకు ఆమెపై అనుమానం వచ్చింది. చుట్టూ పక్కలవారిని ఆరా తీయగా పావని అక్రమ సంబంధం బయటపడింది. వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పావనిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియుడు ప్రదీప్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది.ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌ – పావనిని అదుపులోకి తీసుకున్నారు.పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

Advertisment
తాజా కథనాలు