UP Crime: 'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్​లో చుక్కలు చూపించిన భర్త..!

77 లక్షల కట్నం తీసుకొని భార్యను శారీరకంగా, మానసికంగా హింసించాడు ఓ భర్త. నోరా ఫతేహీలా శరీరాకృతి కావాలంటూ, బలవంతంగా అబార్షన్ పిల్ ఇచ్చి గర్భస్రావానికి కారణమయ్యాడు. దీంతో భర్త, అత్తింటివారిపై భార్య కేసు పెట్టింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
UP Crime

UP Crime

UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ మహిళకు చుక్కలు చూపించాడు శాడిస్టు భర్త. ఎన్నో కలలు కని ఎంతో ఆశతో పెళ్లి చేసుకుంటే విచిత్రమైన కోరికలతో రోజూ నరకం చూపిస్తున్నాడు. షాను అనే యువతిని శారీరకంగా, మానసికంగా వేధించిన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. షాను అనే యువతి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసే శివమ్ ఉజ్వల్ అనే వ్యక్తిని 2025 మార్చి 6న పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబం భారీగా కట్నం ఇచ్చింది - నగదు, నగలు, స్కార్పియో కారుతో కలిపి మొత్తం రూ.77 లక్షల విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే అసలు సమస్య మొదలైంది.

నోరా ఫతేహీ(Nora Fatehi)లా కనిపించాలంటూ టార్చర్..

శివమ్ తన భార్యను బాలీవుడ్ నటి నోరా ఫతేహీ(Nora Fatehi )లా కనిపించాలంటూ ఒత్తిడి చేయసాగాడు. రోజూ గంటల తరబడి వ్యాయామం చేయమని బలవంతం చేసేవాడు. వ్యాయామం చేయలేకపోతే ఆమెకు భోజనం పెట్టకుండా హింసించేవాడు. అంతే కాదు, ఆమెను లావుగా ఉన్నావంటూ ఎప్పుడూ టార్చెర్ చేసేవాడు.

Also Read: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!

షాను చెప్పిన వివరాల ప్రకారం, భర్తకు ఇతర మహిళలపై ఆసక్తి ఎక్కువ. అసభ్యకర వీడియోలు చూసేవాడు, ఇతర మహిళలతో సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది. అత్తింటి కుటుంబం నుండి ఆమెకు ఎలాంటి మద్దతు లేకుండా, అత్తింటి వారు భర్తవైపే ఉండేవారు. తన మామ కేపీ సింగ్ అనుమతి లేకుండా బెడ్‌రూమ్‌లోకి వచ్చేవారని, ఇది తనకు చాలా ఇబ్బందిగా ఉండేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఇటీవల షాను గర్భవతి అయ్యింది. ఆ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అత్తింటి వారు ఆమె గర్భవతిగా ఉన్న విషయాన్ని తెలియగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత, ఆమె ఆడపడుచు ఓ మాత్రను ఇచ్చి బలవంతంగా మింగించింది. ఆ పిల్‌ ఏమిటో తెలుసుకునేందుకు షాను ఇంటర్నెట్‌లో వెతికితే అది అబార్షన్ మందు అని తెలిసింది. కొద్ది రోజుల్లోనే ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, గర్భస్రావం జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఇదంతా తనకు ఇష్టంగా కాదు, బలవంతంగా జరిగిందని షాను ఫిర్యాదు చేసింది.

Also Read: పెళ్లి చూపులు కాగానే.. ఓయో రూమ్ కు తీసుకెళ్లి..

జూన్‌లో పుట్టింటికి వెళ్లిన షాను, జులైలో తిరిగి అత్తింటికి వెళ్ళగా, ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారు. తన వస్తువులు, నగలు కూడా ఇవ్వలేదని ఆమె వాపోయింది. చివరకు, ఆమె భర్త శివమ్ ఉజ్వల్, అతని కుటుంబ సభ్యులపై డౌరీ వేధింపులు, గృహ హింస, బలవంతపు గర్భస్రావం వంటి ఆరోపణలతో ఆగస్టు 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
తాజా కథనాలు