/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు,ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాత్రం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతుంది. తాజాగా డిసీజ్ డిటెక్టివ్స్ పై వేటు వేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంటు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కార్యక్రమాల కోసం పని చేసే వారినే డిసీజ్ డిటెక్టివ్స్ గా పిలుస్తారు.
Also Read: Big BReaking: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..15 మంది మృతి..30 మందికి పైగా గాయాలు!
లక్షల మంది ఉద్యోగుల పై వేటు...
బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతోన్న తరుణంలో వారిని తొలగించడం పై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రొబేషన్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ సాగనంపాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏడాది కాలంగా ప్రొబేషన్ లో ఉండి ఇంకా పర్మనెంటు కాని లక్షల మంది ఉద్యోగుల పై వేటు పడనుంది.
Also Read: Love Jihad: లవ్ జిహాద్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం !.. త్వరలోనే
నిరుడు మార్చి నాటికి ఏడాది కన్నా తక్కువ కాలం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రొబేషనరీ ఉద్యోగుల సంఖ్య 2,20,000.విద్యా శాఖలో వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ సంస్థలో ప్రొబేషనరీ ఉద్యోగులకు ఉద్వాసన ఈ వారమే మొదలైంది. వృద్దులకు క్యాన్సర్ చికిత్స, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని మామూలు పరిస్థితికి తీసుకురావడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమైన పరిశోధక సిబ్బందినీ తీసేస్తున్నారు.
ట్రంప్ రెండో దఫా పాలనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ట్రంప్ మరిన్ని అధికారాలు అప్పజెప్పారు.ఆయన నిర్వహిస్తోన్న డోజ్‌విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అధ్యక్షుడు తాజాగా సంతకం చేశారు. ఇక పై ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల ఉద్వాసన, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో ట్రంప్ ఆదేశించారు.
ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని ,అవసరమైన మేరకు మాత్రమే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు.
Also Read: Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళా గడువు పొడిగించండి.. అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి!