/rtv/media/media_files/2025/07/19/water-in-donetsk-2025-07-19-11-23-43.jpg)
సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికులు విషప్రయోగంతో మరణించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలో విషం కలిపిన వాటర్ తాగి నలుగురు రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. రష్యన్ టెలిగ్రామ్ మిలిటరీ ఛానెల్‌లలో ప్రసారం అవుతున్న దృశ్యాలు, తోటి సైనికులను ఆందోళన కలిగిస్తున్నాయి.
🇷🇺☣ Bottles with poisoned water were delivered to the Russian soldiers in the Donetsk front section, which they died slowly and painfully. The Russian soldier in the video reported four dead comrades. #Russiapic.twitter.com/2NyIiVuCG2
— 🔰 Military-News (@MilitaryNewsEN) July 17, 2025
చికిత్స అందించడానికి ప్రయత్నించగా జవాన్లు మూర్ఛపోయినట్లు, బలవంతంగా శ్వాస పీల్చుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటన డోనెట్స్క్ సమీపంలోని ఫ్రంట్‌లైన్ సెటిల్‌మెంట్ అయిన పాంటెలిమోనివ్కాలో జరిగినట్లు చెబుతారు. వారు తాగిన మై వాటర్ అనే బాటిల్ రష్యా-ఆధీనంలో ఉన్న క్రిమియాలోని సింఫెరోపోల్ నుంచి సరఫరా అయినవి. ఈ నీళ్లు తాగిన మరికొంతమంది రష్యన్ సైనికులు పరిస్థితి విషమంగా ఉంది.
వాటర్ ఎవరు సప్లై చేశారు, అందులో పాయిజన్ ఎవరు కలిపారనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందా? అని రష్యా సైనిక అధికారులు విచారణ చేస్తున్నారు. రష్యన్ సైనిక ఇది ఉక్రెయిన్ పనే అని ఆరోపించారు. జవాన్లు చనిపోయి నాల్గైదు రోజుల కావస్తున్నా.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.