ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్

రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని అంటున్నారు. పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలిన‌ట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ అవి ఏ దేశానికి చెందినవో అని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

New Update
Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists

Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists

రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెహ‌ల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత పాకిస్థాన్‌, భార‌త్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇండియా, పాక్ పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలిన‌ట్లు ట్రంప్ వెల్లడించారు. రిప‌బ్లిక‌న్ ప్రతినిధుల‌తో జ‌రిగిన భేటీలో ట్రంప్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. కానీ ఏ దేశ యుద్ధ విమానాలు కూలిపోయాన‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న స్పష్టం చేయ‌లేదు. అయిదు యుద్ధ విమానాల‌ను కూల్చేశార‌ని ట్రంప్ ఆ మీటింగ్‌లో అన్నారు.

ట్రంప్ ఎవ‌ర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియ‌దు. కానీ ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉంటుంద‌న్న ఉద్దేశం ప‌రోక్షంగా వ్యక్తమవుతుంది. భార‌త్‌కు చెందిన 5 యుద్ధ విమానాల‌ను కూల్చివేసిన‌ట్లు పాకిస్థాన్ చెబుతోంది. దాంట్లో 3 ఫ్రెంచ్ నిర్మిత ర‌ఫేల్ ఫైట‌ర్లతో పాటు 2 సుఖోయ్‌లు ఉన్నట్లు పేర్కొంటున్నది. భార‌తీయ పైలెట్లను కూడా ప‌ట్టుకున్నట్లు పాకిస్థాన్ చెబుతున్నా..  ఆధారాల‌ను మాత్రం ఆ దేశం బ‌హిర్గంతం చేయ‌లేదు.

యుద్ధ విమానాల కూల్చివేత అంశంలో భార‌త్ తొలుత ఎటువంటి వ్యాఖ్యలు చేయ‌లేదు. కానీ ఇటీవ‌ల త్రివిధ ద‌ళాల అధిప‌తి అనిల్ చౌహాన్ మాత్రం స్పందించారు. భార‌తీయ వైమానికి ద‌ళానికి చెందిన ఫైటర్ జెట్లు కోల్పోయిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ చెబుతున్నట్లు ఆరు విమానాల‌ను కోల్పోలేద‌న్నారు. సంఖ్య ముఖ్యం కాదు అని, ఎందుకు.. ఎలా వాటిని కూల్చేశారు, ఆ త‌ర్వాత ఎలా తిప్పికొట్టామ‌న్న అంశాన్ని ఆలోచించాల‌న్నారు.

Advertisment
తాజా కథనాలు