Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
చంద్రుడిపై పలు ప్రాజెక్టులు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది. అవును ఇది నిజమే త్వరలో చంద్రుడి పై రైల్వే స్టేషన్ నిర్మించాలని నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయిని.. మే 19 నాటికి అండమాన్ నికోబార్ దీవులతో పాటు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. జూన్ 1 నాటికి కేరళను తాకే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, రావులపాలెంలో ఉరుములు మెరుపులు, సుడిగాలిలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అఫ్ఘానిస్తాన్‌లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.