Rains In Bengaluru : ఇప్పటికే అడపాదడపా వర్షాలతో(Rains) కాస్త చల్లబడిన బెంగళూరు(Bangalore)… రానున్న రోజుల్లో పూర్తిగా చల్లబడుతుంది అని చెబుతోంది ఇండియన్ వెదర్ డిపార్ట్మెంట్(Indian Weather Department). ఈరోజు బెంగళూరుకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రానున్న వారం రోజులు గ్రీన్ సిటీని బలమైన గాలులు, భారీ వర్షాలు ముంచెత్తుతాయని చెబుతోంది. దీని వలన నగరం అంతా నీటితో మునిగిపోవచ్చని…విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చని హెచ్చరిస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందే ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సూచిస్తోంది.
పూర్తిగా చదవండి..Karnataka : బెంగళూరుకు ఎల్లో అలెర్ట్..వారం రోజులపాటూ భారీ వర్షాలు
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
Translate this News: