PM Modi: సీఎం రేవంత్‌ను అభినందించిన మోదీ.. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ!
రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్దికి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. వర్షాల వల్ల జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. అప్రమత్తంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మోదీ అభినందించారు.