Temperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్

ఇండియాలో ఏప్రిల్, జూన్ మధ్య సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్రత‌లు న‌మోదవుతాయని IMD చీఫ్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. అధిక హీట్‌వేవ్ కారణంగా ఈ సీజ‌న్‌లో సుమారు 10 శాతం వ‌ర‌కు విద్యుత్తు డిమాండ్ పెరగనున్నాయట. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి త్రీవత ఎక్కువ.

New Update
IMD summer

వేసవిలో ఈఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్రత‌లు న‌మోదు కానున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ(IMD) సోమవారం తెలిపింది. మ‌ధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో హీట్‌వేవ్ మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఐఎండీ పేర్కొన్నది. ప‌శ్చిమ‌, తూర్పు భార‌తంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత‌లు నార్మల్‌గా ఉంటాయ‌ని ఐఎండీ తెలిపింది.

Also read: BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన

క‌నిష్ట ఉష్ణోగ్రత‌లు అనేక ప్రాంతాల్లో సాధార‌ణం క‌న్నా అధికంగా ఉండ‌నున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ చీఫ్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, పంజాబ్‌, మ‌ధ్యప్రదేశ్‌, మ‌హారాష్ట్ర, ఉత్తర‌ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా, చ‌త్తీస్‌ఘ‌డ్‌, తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడుతో పాటు క‌ర్నాట‌క ఉత్తర ప్రాంతంలో నార్మల్ క‌న్నా అధిక ఉష్ణోగ్రత‌లు న‌మోదు కానున్నాయి. ఈ వేస‌వి కాలంలో దేశ‌వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ పెర‌గ‌నున్నట్లు మ‌హాపాత్ర తెలిపారు. హీట్‌వేవ్ అధికంగా ఉండటంతో ఈ సీజ‌న్‌లో సుమారు 10 శాతం వ‌ర‌కు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవ‌కాశాలు ఉన్నట్లు ఆయ‌న చెప్పారు. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు ఉత్తర‌, ఈశాన్య భార‌త్‌లోని కొన్ని ప్రాంతాల‌తో పాటు సెంట్రల్ ఇండియా, వాయువ్య భార‌తంలో రెండు లేదా నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రత దినాలు న‌మోదు కానున్నట్లు తెలిపారు. సాధార‌ణంగా ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు ఇండియాలో 4 నుంచి 7 హీట్ వేవ్ వ్యాపించే రోజులుంటాయ‌ని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్నట్లు చెప్పారు. వాయువ్య ప్రాంతంలో ఈసారి వేడిగాలులు వీచే రోజులు ఎక్కవగా ఉంటాయని ఐఎండీ అధికారి తెలిపారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు