India Pollution: ముంచుకొస్తున్న ముప్పు.. అత్యంత కాలుష్య కోరల్లో భారత్‌.. టాప్-3లోనే!

భారత్‌లో కాలుష్యం ముంపు ముంచుకొస్తోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 2024 కాలుష్య దేశాల జాబితాను విడుదల చేయగా భారత్ 111 AQIతో 3వ స్థానంలో నిలిచింది. 140 AQIతో బంగ్లాదేశ్‌ 1, 115 AQIతో పాకిస్థాన్‌ 2 స్థానంలో నిలిచాయి. 

New Update
polution

India 3rd place in the most polluted countries

India Pollution: భారత్‌లో కాలుష్యం ఊహించని రీతిలో పెరిగిపోతుంది. దేశమంతా కాలుష్యం కోరలు చాస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్‌ టాప్ 3లో నిలవడమే ఇందుకు నిదర్శనం. కాగా రియల్‌టైమ్‌ గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్‌సోర్స్‌ సంస్థ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 2024లో కాలుష్య దేశాల జాబితాను విడుదల చేసింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ జాబితాలో భారత్ 3 స్థానంలో నిలవడం అందోళన కలిగిస్తోంది. 

తొలి రెండు స్థానాల్లో బంగ్లా,పాక్..

ఈ మేరకు 2024లో 140 AQIతో బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా.. 115 AQIతో పాకిస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది. 111 గాలి నాణ్యతతో భారత్‌ 3వ స్థానంలో ఉంది. టాప్‌-10లో 103తో బహ్రెయిన్‌, 100తో నేపాల్‌, 92తో ఈజిప్ట్, 90తో UAE, 89తో కువైట్‌, తజకిస్థాన్‌, 87తో కిర్గిస్థాన్‌ మిగతా స్థానాల్లో ఉన్నాయి. ఇక ఏకైక ఆసియాయేతర దేశంగా ఈజిప్టు ఈ జాబితాలో చేరింది.

50లోపు ఉంటేనే సురక్షిత దేశాలు..

సాధారణంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 50లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణించబడుతాయి. అయితే AQI విడుదల చేసిన లిస్ట్‌లో టాప్‌-50 కాలుష్య నగరాల్లో సింహభాగం ఉత్తరభారత దేశంలోనే ఉన్నాయి. AQI జాబితాలో దాదాపు టాప్‌-12 స్థానాలన్నింటినీ భారతే ఆక్రమించింది. అందులో దేశ రాజధాని న్యూఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఉంది. 169 AQIతో ఢిల్లీ కాలుష్యంలో ముందంజలో ఉంది. వాహనాలు, పారిశ్రామిక కార్యకలాపాలతో ఢిల్లీలో తీవ్రమైన పొల్యూషన్‌ ఏర్పడుతుంది.  

దక్కన్‌ పీఠభూమి సైతం..

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో ఢిల్లీ తర్వాతి స్థానంలో 166 గాలి నాణ్యతతో గ్రేటర్‌ నోయిడా, 161 AQIతో నోయిడా, 159తో ఘాజియాబాద్‌, 154 AQIతో ఫరియాబాద్‌, గురుగ్రామ్‌, బివాండీ-153, పాట్నా, సోనిపట్-145, ముజఫర్‌నగర్‌-144 AQI తో అత్యంత కలుషితమయంగా మారాయి. ఇక బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా 140 గాలినాణ్యతతో 13 స్థానంలో నిలిచింది. AQI డేటా ప్రకారం భారత్‌లోని దక్షిణాది నగరాలు కొంతవరకు సురక్షితంగా ఉన్నా.. రియల్‌- టైమ్‌ డేటాలో మాత్రం దక్కన్‌ పీఠభూమి దిగువ ప్రాంతాలు టాప్‌లో ఉంటున్నాయి. 

ఇది కూడా చదవండి: నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! !

వాహనాలు, భారీ ట్రాఫిక్‌, పరిశ్రమ కార్యకలాపాలు, నిర్మాణాల కారణంగా వచ్చే దుమ్ము, ఫ్యాక్టరీల వ్యర్థాలతో రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్య నియంత్రణ కోసం భారత ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లేదంటే కాలుష్యం కారణంగా భారత్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్‌ఫార్మర్‌పై చెలరేగిన మంటలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు