/rtv/media/media_files/2025/03/06/L5UwAWnqCdN6FVlHBnzt.jpg)
ap heatwave Photograph: (ap heatwave)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏసీ స్టేట్ డిజాస్టర్ మ్యానేజ్‌మెంట్ అథారిటీ హెచ్చరించింది. అల్లూరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు పలు జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీవే అవకాశం ఉందని తెలిపింది. మొత్తం 143 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు అత్యధిక ఉష్ణోగ్రత మోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు.
Also read: తెలుగు సినిమా పేర్లు చెప్పి రూ.1.34 కోట్లు కొట్టేశాడు
గురువారం అల్లూరి జిల్లా
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) March 5, 2025
అడ్డతీగల, దేవిపట్నం,గంగవరం, రంపచోడవరం మండలాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలాల్లో తీవ్రవడగాల్పులు(05), అలాగే 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని #APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. #Heatwave#Summer2025#AndhraPradeshpic.twitter.com/qJSzDChfVL
బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లాలో నమోదైయ్యాయి. ఆత్మకూరులో 40.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో 40 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో కంకిపాడులో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. గురువారం( ఈరోజు ) సాధారణం కంటే 4 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పొడిగాలులు వీయడం కారణంగానే ఎండలు మండిపోయినట్లు పేర్కొంది.
ఇది కూడా చూడండి:Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!