Fire Accident: అమ్రాబాద్ అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. నల్లమలలోకి ఎంట్రీ!

నాగర్ కర్నూల్ అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దోమల పెంట అటవీ క్షేత్ర పరిధిలో కార్ చిచ్చు మొదలైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీశైలం, నల్లమలలోకి ఈ మంటలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

New Update
fire acident

Amrabad Reserve Tiger Forest fire accident

Fire Accident: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి దోమల పెంట అటవీ క్షేత్ర పరిధిలో కార్ చిచ్చు మొదలైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారికి కుడి వైపున వందలాది హేక్టర్లలో అడవి అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!

అల్లాడుతున్న వన్య ప్రాణులు..

ఈ మంటలతో అడవిలో ఉన్న వణ్య ప్రాణులు అల్లాడుతూ ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవిలో ఉన్న వివిధ విలువై మొక్కలు, వన ములికలు పూర్తిగా వినాశనం అయ్యాయి. ఈ అడివిలో కార్చిచ్చు సంఘటనలు గుర్తించే అటవీశాఖ షాట్ లైట్ ప్రస్తుతం కార్చిచ్చు ప్రమాదాలను పసిఘట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మంటలను వీలైనంత త్వరగా అదుపుచేయకపోతే నల్లమల అడవిలోకి ప్రవేశించే అవకాశం ఉందని, అలా జరిగితే భారీ విపత్తు తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Also Read: రణవీర్‌ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు