TG Rains: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన!

ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరికలు జారీ చేసింది.

New Update
ap rains

Telangana rains

TG Rains: ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9  కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడించింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో ఇది ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. 



పడిపోనున్న ఉష్ణోగ్రతలు..

గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

Also Read :  ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!

ఇక గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఉంటాయి. గంటకు 40 కి మీ నుండి 50 కి. మీ వేగం కలిగిన ఈదురుగాలులు  వీస్తాయి. వడగళ్లతో కూడిన వర్షాలు చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో  ఉరుములు మెరుపులు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

Also Read :  ఆ అందగత్తెతో  డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్‌

ఇక మధ్య ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 1.5 కి మీ ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీన పడినట్లు తెలిపింది. అలాగే నిన్న నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కూడా బలహీనపడిందని వెల్లడించింది. 

telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు