తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

New Update
winter

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ప్రారంభమైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల 12 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే... చలి తీవ్రత ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో..

ఈ సీజన్‌లో రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. ఈనెలలో సగటున 13నుంచి 17డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వివరించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం నల్లగొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్‌, హయత్‌నగర్‌, పటాన్‌చెరు, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా..

రిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడలో 14.7, పెదబయలులో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బంగాళాఖాతంలో 17న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వివిధ మోడళ్లు సూచిస్తున్నాయి. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత నెలలో తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులు కూడా గడవముందే చలి తీవ్రత ప్రారంభం కావడంతో భిన్న వాతావరణంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పలువురు జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు