Weather Update: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

New Update
Rains

Rains

వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడపలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Anil Ambani: అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు

తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో హైదరాబాద్‌, యాదాద్రి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, యూసుఫ్ గూడ, మధురానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, పటాన్ చెరువు, బేగంపేట్, దిల్‌సుఖ్ నగర్, హైటెక్ సిటీలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ తెలిపింది. 

అప్రమత్తంగా ఉండాలని..

ఈ వర్షాలకు ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా వేటకు వేళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. కావాల్సిన వాటిని ముందుగానే ఇంటికి తీసుకుని వచ్చి పెట్టుకోవాలి. వర్షాల సమయంలో మిగతా వారితో పోలిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు తొందరగా మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Mystery Temple: మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?

Advertisment
తాజా కథనాలు