/rtv/media/media_files/2025/10/15/mallojula-venugopal-rao-2025-10-15-13-00-34.jpg)
Maoist leader Mallojula surrenders
Mallojula Venugopal : మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు మావోయిస్టుల్లో రెండవ స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్, అలీయాస్ సోను అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు గా ఉన్న మల్లోజుల 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల, ఆయన సహచర బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని నష్టమనే చెప్పాలి.
మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ గత కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమంటూ ఆయన అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి జనజీవనంలోకి అడుగుపెట్టారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఒకేసారి రెండు ఆవర్తనాలు.. అప్రమత్తమవుతున్న అధికారులు
మల్లోజుల వేణుగోపాల్ ప్రస్థానం..
మల్లోజుల వేణుగోపాల్ రావు సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి పట్టణానికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువుకుంటున్న సమయంలోనే 1970 దశకంలో ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో పనిచేశారు. అనంతరం అండర్ గ్రౌండ్‌కు వెళ్లారు. పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మన్ రావుతో సమకాలికుడిగా పనిచేశారు. వేణు గోపాల్ ప్రధానంగా పొలిటికల్, ఐడియాలజికల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ కంటే భావజాలం, ప్రకటనలు, లెటర్స్ ద్వారా ఉద్యమాన్ని గైడ్ చేశారు. ఆయనను ‘అభయ్’, అలియాస్ సోను, భూపతి, వివేక్, రాజన్ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Snacks for tenth graders : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే..
అంచెలంచెలుగా ఎదిగి
సీపీఐ (మావోయిస్టు)లో ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్‌గా మొదలై, పాలిట్‌బ్యూరో మెంబర్‌గా ఎదిగారు. ఉద్యమం యొక్క చీఫ్ స్పోక్స్‌పర్సన్, ఐడియాలజికల్ హెడ్‌గా పనిచేశారు. వేణుగోపాల్ తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ నంబాల కేశవ రావు (బసవరాజు) మరణం తర్వాత, సీపీఐ (మావోయిస్టు)ను లీడ్ చేసే ఫ్రంట్ రన్నర్‌గా నిలిచారు. కాగా, బసవరాజు 2025 మేలో చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వేణుగోపాల్‌పై 100కు పైగా కేసులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు