/rtv/media/media_files/2025/08/18/mumbai-rains-2025-08-18-10-17-19.jpg)
Mumbai Rains
Red Alert for Mumbai : భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబయి చిగురుటాకులా వణుకుతోంది. గత కొంతకాలంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబయి లోని రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వర్షాలు వచ్చిన ప్రతిసారి ముంబయి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ముంబయిని వర్షం ముంచెత్తడంతో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read:Janhvi Kapoor Photos: అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్ అదిరింది.. కుర్రకారు ఫిదా!
ఇక వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల వల్ల దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 9.50 గంటల ప్రాంతంలో ముంబయి రావలసిన 8 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించక పోవడంతో పలు విమానాలు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు. దీంతో విమాన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్ చేసుకోని విమాన శ్రయానికి రావాలని సూచించింది.
Also Read : లవర్ ను దింపేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా.. స్పాట్ లోనే ఇద్దరూ!
అంతేకాక పలు విమానయాన సంస్థలు కూడా తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వర్షాలు, వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుందని, విమాన ప్రయాణీకులు ముందుగానే ఇళ్ల నుంచి బయల్దేరాలని సూచించాయి. అదే సమయంలో భారీ వరదలకు పలు చోట్ల రైలు పట్టాలు నీట మునిగిపోయాయి. దీంతో ముంబయి లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలకు బయటకురావద్దని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హెచ్చిరిక జారీ చేసింది.
Also Read: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
గడచిన 24 గంటల్లో, ముంబయి నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. విఖ్రోలి ప్రాంతంలో అత్యధికంగా 255.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ముంబయి లో కురుస్తున్న భారీ వర్షపాతం కారణంగా గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలు పడిన ప్రతిసారి ముంబయి నగరం నీటి మునగడం సర్వసాధారణమైంది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
Also Read: ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఏడుగురు మృతి