/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లవద్దని తెలిపారు.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, ఏలూరు, మన్యం, అరకు, లంబసింగి, కర్నూలులో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Hyderabad rains and @GooglePixel_US
— Naveen Kumar S (@naveenkumar_nks) July 26, 2025
Gives some awesome pictures.
Check this out shot on my Pixel6A#HyderabadRains#Hyderabad#googlepixelpic.twitter.com/Nv6sWofAMM