Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని ప్రముఖ మానసాదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అయితే, తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Mansa Devi Temple

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని ప్రముఖ మానసాదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అయితే, తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తొక్కిసలాటకు పుకార్లే కారణమని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ వెల్లడించారు. విద్యుత్ తీగ తెగిపోయిందంటూ పుకార్లు వ్యాప్తి చేశారని.. ఫొటోలు, వీడియోల ద్వారా తెలిసిందన్నారు. మృతులు విద్యుత్ షాక్‌కు గురైనట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ పుకార్లను ఎవరు వ్యాప్తి చేశారన్న అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాలను సైతం పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. పుకార్ల నేపథ్యంలో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారని.. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పిల్లలు సైతం ఉన్నట్లు సమాచారం. మానసాదేవి ఆలయం పర్వతంపై ఉంటుంది. కన్వర్‌ యాత్ర నేపథ్యంలో మూసివేసిన రోడ్డును తెరిచారు.

దాంతో దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పర్వతంపై ఎత్తున ఉన్న ఆలయానికి వెళ్లేందుకు చేరుకోవడానికి భక్తులు ఇరుకైన మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. మెట్లు సైతం తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో అక్కడ జారపడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. మానసాదేవి తొక్కిసలాట కారణంగా పలువురు గాయపడ్డట్లుగా తమకు సమాచారం అందిందని ఎస్‌ఎస్‌పీ ప్రమోద్‌ సింగ్‌ దోబాల్‌ తెలిపారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని.. దాదాపు 35 మందిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.

గాయపడ్డ వారు చికిత్స పొందుతున్నారన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ తీగ తెగిపడిందని పుకార్లు వ్యాప్తి చేశారని.. దాంతోనే తొక్కిసలాట జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం ఉందన్నారు. బిహార్‌కు చెందిన సంతోష్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ విద్యుత్‌ తీగ పడిపోయిందని చెప్పారన్నారు. తాను చాలా మందిని కాపాడానని.. వీలైనంత వరకు సహాయం చేసినట్లుగా తెలిపాడు. తాను సైతం తొక్కిసలాటలో పడిపోయానని.. తనతో వచ్చిన వారంతా విడిపోయారన్నారు. సరిగ్గా నిలబడేందుకు కూడా స్థలం లేదని.. ఒకరినొకరు తోసుకుంటు వచ్చారని తెలిపాడు.

Advertisment
తాజా కథనాలు