Heavy Rains: అలెర్ట్‌.. కాసేపట్లో భారీ వర్షం

కాసేపట్లో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, సూర్యపేట, యాదాద్రి,వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.

New Update
Heavy Rains

Heavy Rains

కాసేపట్లో తెలంగాణ(telangana) లో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రంగారెడ్డి, సూర్యపేట, యాదాద్రి,వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అలాగే రాగాల మూడు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 

Also Read: ఏక్‌నాథ్ షిండే ఎక్స్ అకౌంట్ హ్యాక్.. పాకిస్తాన్ ఫోటోలను

Heavy Rain In Telangana District

సెప్టెంబర్ 25 నాటికి తూర్పు మధ్య బంగాళఖాతం  సమీపంలో ఉత్తర బంగాళఖాతం ప్రాంతంలో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు. అలాగే ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయవ్య దాని సమీపంలో పశ్చిమ మధ్య బంగాళఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర సమీపంలో సెప్టెంబర్ 26 నాటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో సెప్టెంబర్ 27 నాటికి తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. 

Also Read: వినియోగదారులకు గుడ్ న్యూస్.. 700కి పైగా అమూల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు!

Advertisment
తాజా కథనాలు