/rtv/media/media_files/2025/10/24/taxi-2025-10-24-20-32-49.jpg)
Bharat Taxi, India's First Cooperative Cab Service To Challenge Ola, Uber
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ఈ సేవలు పైలట్ ప్రాతిపదికన ప్రారంభించనున్నారు. ముందుగా 650 మంది సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లు ఈ సేవలు అందిస్తారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఈ ఏడాది డిసెంబర్‌లోనే దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
ఈ భారత్ ట్యాక్సీ గురించి గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తావించారు. సహకార సంఘాల మాదిరిగానే ఇది పనిచేస్తుంది. ఇందులో టూవీలర్, ఆటోలు, ఫోర్ వీలర్లు సేవలు అందిస్తాయి. దీనిపై వచ్చే లాభాలను ఏ కంపెనీ కూడా తీసుకోదు. కేవలం డ్రైవర్లకు మాత్రమే లబ్ధి జరుగుతందని అమిత్ షా గతంలోనే చెప్పారు. ఇదిలాఉండగా ఉబర్, ఒలా, రాపిడో లాంటి కంపెనీలు తమ ఆదాయం నుంచి 25 శాతం కమీషన్లు తీసుకోవడంపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీని తీసుకొస్తోంది. ఇందులో రిజిస్టర్ అయిన ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పని ఉండదు. కేవలం మెంబర్‌షిప్ కింద కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: కయ్యానికి కాలు దువ్వతున్న చైనా.. సరిహద్దులో ఎయిర్ బేస్ నిర్మాణం
ఇక ఈ భారత్ ట్యాక్సీ సేవలు వచ్చే ఏడాది మార్చి నాటికి మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. 2030 నాటికి లక్షమంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయాలని భావిస్తోంది. 'సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' కింద ఈ ట్యాక్సీ సేవలు అందనున్నాయి.
Follow Us