/rtv/media/media_files/2025/10/25/chinnatekur-bus-accident-shivashankar-friend-identified-police-update-tkr-2025-10-25-14-41-54.jpg)
chinnatekur bus accident shivashankar friend identified police update tkr
Kurnool Bus Accident: కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి(Kurnool Bus Accident New) సాధించారు. బైక్ ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు బైక్ రైడర్ శివశంకర్ మృతదేహన్ని ఘటనాస్థలిలోనే గుర్తించగా వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామి విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఎట్టకేలకు అతని ఆచూకీ లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం వేకువజామున స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి శివశంకర్ బైక్‌పై డోన్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో చిన్న టేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Kaveri Travel Bus Fire) ఢీకొట్టడంతో వారిద్దరు ఎగిరిపడ్డారు. అయితే కింద పడిన వెంటనే ఘటనాస్థలిలోనే శివశంకర్ మృతి చెందగా.. ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి బయట పడిన ఎర్రిస్వామి భయంతో ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాడు. కాగా అతని ఆచూకీని పోలీసులు కనుక్కోని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనపై అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
— RTV (@RTVnewsnetwork) October 25, 2025
నిన్నటి బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
పెట్రోల్ బంకు నుంచి వెళ్తున్న విసుఅల్స్.#AndhraPradesh#kurnool#busfireaccident#biker#petrolbunk#RTVpic.twitter.com/rUfuUqHEqD
Also Read : కర్నూలు బస్సు ప్రమాదం.. శివశంకర్ వెనుక కూర్చున్న టామీ ఎక్కడ?
Shiva Shankar's Friend Swami In Police Custody
కాగా స్వామి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా-- బైక్‌ను Vకావేరి బస్సు ఢీకొట్టలేదని పోలీసులు గుర్తించారు. -- శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. -- మొత్తం రెండు ప్రమాదాలు జరిగినట్లు ఎర్రిస్వామి వివరించాడు.-- పెట్రోల్ బంక్ నుంచి 3కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగిందని స్వామి తెలిపాడు.-- బస్సు ఢీ కొట్టకముందే శివశంకర్ బైక్‌ను డివైడర్‌కు ఢీకొట్టినట్లు తెలిపాడు. బైక్ నుంచి కింద పడ్డ శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ ప్రమాదంలో బైక్ రోడ్డు మీద పడిపోయింది. దాన్ని పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నించాడు. అయితే అప్పటికే వేగంగా వస్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిందని వెళ్లడించాడు. కాగా స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి స్టేట్ మెంట్ ఆధారంగా తదిపరి విచారణ చేయనున్నట్లు పోలీసులు వెళ్లడించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటలు రావడం చూసి వెంటనే అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సును ఢీకొట్టి బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బస్సును ఢీకొనే సమయంలో బైక్‌పై నడుపుతున్న శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: New York: న్యూ యార్క్‌లో రెండిళ్ళను తగులబెట్టిన దీపావళి బాణాసంచా
Follow Us