Weather Update: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న భారీ వర్షాలు

నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది.

New Update
weather Updates

Weather Update

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయని దీనివల్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది చివరకు శక్తి తుపాన్‌గా మారుతుందని ఐఎండీ తెలిపింది.

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

ఏడు రోజుల పాటు..

మరో ఏడు రోజులు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వీటితో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో గద్వాల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు