Viral Video: పెళ్లి వేదికపైకి ఖడ్గమృగం సడెన్ ఎంట్రీ.. బిత్తరపోయిన అతిథులు! వీడియో వైరల్

నేపాల్ లోని చిత్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలోకి ఖడ్గమృగం నడుచుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని అక్కడ పెళ్ళిలో ఉన్న ఓ నెటిజన్ వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది.

New Update
viral video_ Rhino walks into wedding

viral video_ Rhino walks into wedding

Viral Video: సాధారణంగా మొదలైన వివాహ వేడుక.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి వేదికగా మారింది. వివాహ వేడుకలోకి ఊహించని వింత అతిథి ఎంట్రీ ఇచ్చింది. ఒక ఖడ్గ మృగం(Rhinoceros) వేదికపైకి నడుచుకుంటూ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన నేపాల్ లోని చిత్వాన్ లో జరిగింది.  దీనిని అక్కడ పెళ్ళిలో ఉన్న ఓ నెటిజన్ వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది.  'nepalinlast24hr' అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  (latest-news) 

Also Read :  బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

Also Read :  క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?

Also Read :  జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

Also Read :  US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

పెళ్ళికి వైల్డ్ కార్డు ఎంట్రీ

ఖడ్గమృగం వివాహ వేదికపైకి నడుచుకుంటూ రావడాన్ని చూసి ఓ నెటిజన్ .. ''పెళ్ళికి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. మరొకరు..  "ఇన్విటేషన్‌లో 'అందరికీ స్వాగతం' అంటే ప్రకృతి కూడా వచ్చింది! అని ఫన్నీగా రాశాడు. మనం వేడుకలు చేసుకునే ప్రదేశాలు అడవులకు దగ్గరగా ఉంటే ఇలాంటి వింత సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది భయపెట్టే విషయం కాకపోయినప్పటికీ.. జాగ్రత్తగా ఉండడం మంచింది. ఏదేమైనా ఖడ్గమృగం ఎంట్రీ..  పెళ్లి వేడుకను అతిథులు మర్చిపోలేని  విధంగా మార్చింది. ఒక ఖడ్గ మృగం వివాహ  వేడుకలోకి రావడం అరుదైన సంఘటనగా చెబుతున్నారు. (telugu-news) 

 

latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu viral news | national news in Telugu

#national news in Telugu #telugu viral news #breaking news in telugu #today-news-in-telugu #telugu-news #latest-telugu-news #Rhinoceros
Advertisment
Advertisment
తాజా కథనాలు