/rtv/media/media_files/2025/04/26/kPQLw6DRUy8zUADcSj3r.jpg)
Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)
పహల్గామ్ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ మాజీ సైన్యాధికారి సంచలన విషయాలు బయటపెట్టారు. పాక్ ప్రజలకు తనపై ఉన్న అసమ్మతిని మళ్లించడానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌కు కుట్ర చేశారని అన్నారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని బైసరన్ లోయలో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు. ఆ దాడికి సూత్రదారి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, దాన్ని పర్యవేక్షించింది ఐఎస్ఐ చీఫ్ అని పాక్ ఆర్మీ మాజీ మేజర్ ఆదిల్ రాజా తెలిపారు.
Also Read : టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు
Pakistani Army
#BreakingNews | पहलगाम आतंकी हमले पर सबसे बड़ा खुलासा, हमले में पाक आर्मी के शामिल होने के पक्के सबूत, पहलगाम हमले में पाकिस्तानी आर्मी शामिल थी, पाक आर्मी चीफ मुनीर है आतंकी हमले का मास्टरमाइंड#Pakistan #PakistanArmy #JammuKashmir #OperationSindoor @peenaz_tyagi… pic.twitter.com/Gw4ncJm7OE
— India TV (@indiatvnews) May 28, 2025
Also Read : Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
ఇందులో పాక్ ఆర్మీలో పని చేస్తున్న ఐదుగురు ఉన్నతాధికారుల ప్రమేయాన్ని కూడా కలిగి ఉందన్నారు. పహల్గామ్ టెర్రర్ అటాక్‌కు కారణమైన ఆ అధికారుల పేర్లు, ఫేస్‌లు, వివరాలు ఇప్పుడు బయటకొచ్చాయని మేజర్ ఆదిల్ రాజా అన్నారు.
పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్టులకు ఎలా సపోర్ట్ చేస్తోందో, జమ్మూ కాశ్మీర్‌లో హింసను రెచ్చగొట్టడానికి చొరబాట్ల కోసం ఎలా పనిచేస్తుందో రాజా ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉగ్రదాడిలో తమ సైన్యం ప్రమేయం ఉందని, అందులో అసిమ్ మునీర్ ప్రత్యక్ష పాత్ర పోషించాడని మేజర్ ఆదిల్ రాజా కామెంట్స్‌లో క్లారిటీగా అర్థమవుతున్నాయి.
Also Read : సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా
Also Read : ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే
pakistan-army | pahalgam terror attack | Pahalgam terror attack 2025 | jammu-kashmir | latest-telugu-news