/rtv/media/media_files/2025/04/16/zsX7hoMjX8FpSmWFKCXQ.jpg)
కారు డిక్కీ డోరు సరిగా పడలేదు. డిక్కీలోంచి మనిషి చేయి వేళాడుతుంది. అది చూసిన వారు వారు అందులో ఎవరినైనా కిడ్నాప్ చేసి అందులో తీసుకెళ్తున్నారా..? లేదా చంపేసి డెడ్‌బాడీ షిఫ్ట్ చేస్తున్నారాని షాక్ అయ్యారు. అనుమానంతో ఆ కారుని వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో ఓవర్ నైట్‌లో వైరల్ అయ్యింది. సోమవారం సాయంత్రం నవీ ముంబైలోని వాషిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఏప్రిల్ 14న సాయంత్రం ఓ కారు వెనుక డోర్ నుంచి మనిషి చేయి వేళాడింది. అది చూసిన వారు భయపడ్డారు. అనుమానంతో దాన్ని వీడియో తీశారు. ఆ వీడియో వైరలై పోలీసులు కంటపడింది. వెంటనే రంగం లోకి దిగిన ముంబై పోలీసులు కారు నెంబర్ ఆధారంగా కారు ఓనర్ వివరాలు కనుక్కున్నారు. వెహికల్ నెంబర్ ట్రాక్ చేసిన ఓనర్ డిటేల్స్ కనుక్కున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో ఆ సమయంలో కారు ఎక్కడ నుంచి వస్తోంది. కారు డిక్కీ నుంచి వెళాడుతున్న చేయి ఎవరిది అని ఎక్వైరీ చేశారు. వారు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. అది చేయి కాదని, బొమ్మ చేయి అని ఆ కారు నడిపిన వారు చెప్పారు.
नवी मुंबई में मचा हड़कंप, चलती कार की डिग्गी से लटकता दिखा हाथ, वीडियो वायरल
— Khushbu_journo (@Khushi75758998) April 16, 2025
वाशी में इनोवा की डिक्की से लटकता हाथ! वायरल वीडियो से मची खलबली#NaviMumbai #ViralVideo #DeadBody #InstaReels#reels #reelsfeed #navimumbai #crime #navimumbaicrime #hand pic.twitter.com/P4IwxrSPSQ
అది కావాలని తీసిన వీడియో అని యువకులు స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్ షాప్ ప్రమోషన్స్ కోసం తీసిన వీడియో అని పోలీసులకు సమాధానం చెప్పారు. ముగ్గురు యువకులు ఈ పని చేశారు. ముందు కారులో బొమ్మచేయి కారు డిక్కీలోనుంచి బయటకు వేళాడదీని వెనుక మరో కారులోంచి వారే వీడియో తీసి సోషల్ వీడియాలో అప్‌లోడ్ చేశారు. అది వైరల్ అయితే ల్యాప్‌టాప్ షాప్‌కు సేల్స్ పెరుగుతాయని అనుకున్నారు. అదే వారి ప్లాన్. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటింగ్ టీమ్ ఈ ట్రిక్ వాడుకొని ఓ షాప్‌కు ప్రమోషన్స్ చేసింది. అది కాస్త పోలీసుల కంటపడి బెడిసికొట్టింది. ముంబై పోలీసులు ఆ ముగ్గురు యువకులపై యాక్షన్ తీసుకున్నారు. MH01/db7686 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఇన్నోవా కారుపై సాన్పాడ పోలీస్ స్టేషన్‌లో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 కింద కేసు నమోదు చేశారు.
Also read: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా..? అయితే ఇలా చేయండి
Navi Mumbai: तो हात कोणाचा? नवी मुंबईतील धक्कादायक प्रकार#reels #reelsfeed#lokshahimarathi #navimumbai #crime #navimumbaicrime #hand pic.twitter.com/ybiaXcaSWo
— Lokshahi Marathi (@LokshahiMarathi) April 14, 2025