/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు అత్యున్నత న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు. కేసు విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టాల అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. ముస్లీం కమ్యూనిటీ అధికారాలను లాక్కునేందుకు కుట్ర జరుగుతుందని కపిల్ సిబల్ కోర్టులో పేర్కొన్నారు. వక్ఫ్ నూతన చట్టాలు మతస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
Also read: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా..? అయితే ఇలా చేయండి
హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుందా, హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని సీజేఐ ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు భూముల్లోనే ఉందని సీజేఐ అన్నారు. చారిత్రాత్మక ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించలేమన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. 2వారాల్లో కేంద్రం వక్ఫ్ చట్టంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు పంపింది. కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధికారం కల్పించడంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.