/rtv/media/media_files/2024/12/05/0TGK4Kq5BP2WXRmrzjtm.jpg)
whatsapp Photograph: (whatsapp)
ఈరోజుల్లో వాట్సాప్‌లోనే అన్నీ ఫైల్స్, డేటా, ఫొటోస్ షేర్ చేసుకుంటున్నారు. అయితే మీ వాట్సాప్ హ్యాక్ అయితే అది చాలా డేంజర్, మీ పర్సనల్ డేటా అంతా ఇతరుల చేతికి వెళ్తోంది. ఒకేవళ అకౌంట్ హ్యాక్ అయితే దాన్ని ఎంత త్వరగా రికవరీ చేస్తే అంతమంచిది. వరల్డ్ వైడ్ వాట్సాప్ యూనియోగదారులు 3 బిలియన్ల వరకు ఉన్నారు. అందుకే వాట్సాస్ అకౌంట్లే టార్గెంట్ చేసుకొని చాలామంది సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియాలో డిజిటల్ అరెస్టులు, సైబర్ క్రైమ్ లు పెరిగిపోయాయి. వాట్సాప్ నుంచి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. అకౌంట్ విషయంలో ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాక్ అయితే వాట్సాప్‌ను ఎలా రికవరీ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడండి.
ఫస్ట్ మీ వాట్సాప్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
అనధికార యాక్సెస్‌ను నిరోధించడానికి ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసివేసియండి.
మీ ఫోన్‌కు వైఫై కనెక్ట్ చేసి యాప్ స్టోర్ నుంచి WhatsApp ని తిరిగి ఇన్‌స్టాల్ చేయండి.
ఇప్పుడు మరో కీప్యాడ్ ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ అయిన సిమ్ కార్డు ఉంచండి.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి అకౌంట్ లాగిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పెట్టిండి.
వాట్సాప్ తో లింక్ అయిన ఫోన్‌నెంబర్ కు కోడ్ వస్తోంది.
దాదాపు 10 నుండి 20 నిమిషాల తర్వాత, మీ కీప్యాడ్ ఫోన్‌లో కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. అది ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫిల్ చేయండి.
కోడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఆండ్రాయిన్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు మీ WhatsApp ఖాతాకు తిరిగి యాక్సెస్ పొంది ఉండాలి.