Ranabali Glimpse: రౌడీ హీరో సినిమా ‘రణబాలి’ పై AI ఎఫెక్ట్.. డైరెక్టర్ ఏమన్నాడంటే..?

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్ AIతో చేయలేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 19వ శతాబ్దపు కథతో తెరకెక్కిన ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

New Update
Ranabali Glimpse

Ranabali Glimpse

Ranabali Glimpse

Ranabali Glimpse: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘రణబాలి’. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. గ్లింప్స్‌లో ఉన్న విజువల్స్ చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే ఈ వీడియోను AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి తయారు చేశారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ స్పందించారు. గ్లింప్స్‌ను AIతో చేయలేదని స్పష్టంగా చెప్పారు. ప్రతి ఫ్రేమ్‌ను చాలా కష్టపడి రూపొందించామని తెలిపారు. ఈ గ్లింప్స్‌ను సిద్ధం చేయడానికి నెలల సమయం పట్టిందని, టీమ్ మొత్తం ఎంతో శ్రమించిందని చెప్పారు. దీనితో అభిమానులు దర్శకుడిని ప్రశంసిస్తున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన కఠిన పరిస్థితులు, వారు భారతదేశంలో సృష్టించిన కరవు దృశ్యాలను చూపించారు. భారతదేశ సంపదను ఎలా దోచుకున్నారో గ్లింప్స్‌లో చూపించారు. చివర్లో విజయ్ దేవరకొండను ‘రణబాలి’గా పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ, “బ్రిటిషర్లు అతడిని అనాగరికుడు అన్నారు. నేను కాదనను. అతను మన అనాగరికుడు” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య జరిగిన నిజమైన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ సిరీస్ నటుడు) విలన్‌గా కనిపించనున్నారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుల జంట అజయ్–అతుల్ అందిస్తున్నారు.

‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌తో విజయ్ దేవరకొండకు ఇది మూడో సినిమా కావడం విశేషం. ‘రణబాలి’ సినిమా 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisment
తాజా కథనాలు