Gold Searching: వరదల్లో కొట్టుకుపోయిన 20Kgల బంగారం.. వీధులన్నీ గాలిస్తున్నారు

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని వుకి కౌంటీని అకస్మాత్తుగా ముంచెత్తిన వరదలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల్లో స్థానిక లావోఫెంగ్‌షియాంగ్ బంగారు దుకాణం నుంచి దాదాపు రూ.12 కోట్ల విలువైన 20 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి.

New Update
Gold hunting in china floods

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని వుకి కౌంటీని అకస్మాత్తుగా ముంచెత్తిన వరదలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల్లో స్థానిక లావోఫెంగ్‌షియాంగ్ బంగారు దుకాణం నుంచి దాదాపు రూ.12 కోట్ల విలువైన 20 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో స్థానికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రంగంలోకి దిగారు. కళ్లు కాయలు కాసేలా వీధుల్లో బంగారు కోసం వెతుకుతున్నారు. చైనా కాబట్టి కొంచెం అప్‌డేట్‌లో ఉన్నారు. చాలామంది గోల్డ్ డిటెక్టర్లతో సహా వివిధ పద్ధతులతో కొట్టుకుపోయిన ఆభరణాల కోసం వెతకడం ప్రారంభించారు.

Also Read :  రష్యాలో భారీ భూకంపం.. సునామీ బీభత్సం

Gold Hunting In China Floods

లావోఫెంగ్‌షియాంగ్ దుకాణం యజమాని యె మాట్లాడుతూ.. జూలై 25న ఉదయం ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయినప్పుడు తమ సిబ్బంది దుకాణాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే వరదలు ముంచెత్తడంతో నగలను లాకర్లలో భద్రపరచడానికి సమయం లేకుండా పోయిందని తెలిపారు. కొన్ని నిమిషాల్లోనే వరదనీరు దుకాణంలోకి ఒక మీటరు లోతుకు చేరిందని, డిస్‌ప్లేలో ఉంచిన నగలు కేబినెట్‌లతో సహా కొట్టుకుపోయాయని వివరించారు. ఈ వరదల్లో బంగారు గాజులు, నెక్లెస్‌లు, హియర్ రింగ్స్, డైమండ్ రింగులు, వెండి వస్తువులు, పచ్చలు సహా మొత్తం 10 మిలియన్ యువాన్ల (సుమారు రూ.12 కోట్లు) విలువైన ఆభరణాలు కొట్టుకుపోయాయని ఆయన అంచనా వేశారు.

యె కుమారుడు జియాయె మాట్లాడుతూ.. ఫామిలీతోపాటు దుకాణం ఉద్యోగులు 2 రోజులు బురద నీటిలో నగలను వెతికారని, అయితే కేవలం 1 కిలోగ్రాము మాత్రమే తిరిగి లభించిందని చెప్పాడు. అందులో కొంతమంది స్థానికులు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చినవి కూడా ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై వార్తలు విస్తరించడంతో చాలా మంది స్థానికులు తమ డిటెక్టర్లతో సహా ఆభరణాల కోసం వెతకడం మొదలుపెట్టారు. కొంతమందికి నగలు దొరికినా వాటిని తిరిగి ఇవ్వడానికి ముందుకు రాలేదని జియాయె తెలిపారు. ఈ సంఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read :  మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు

latest-telugu-news | viral-videos | china floods video | china flood 2025 | telugu viral news | international news in telugu | telugu-news

Advertisment
తాజా కథనాలు